"అతడే శ్రీమన్నారాయణ" సినిమాతో మంచి గుర్తింపు సంపాదించిన రక్షిత్ శెట్టి నటించిన మరో విభిన్నమైన చిత్రం "777చార్లీ". ఈ సినిమా పాన్ ఇండియా రేంజులో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో జూన్ 10వ తేదీన విడుదలైంది. కిరణ్ రాజ్ దర్శకత్వంలో కామెడీ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని జి.ఎస్ గుప్తా తో కలిసి రక్షిత్ శెట్టి నిర్మించారు.
ప్రేక్షకుల నుండి ముఖ్యంగా పెంపుడు కుక్కలను ప్రాణంగా చూసుకునే వారినుండి ఈ సినిమాకు అద్భుతమైన స్పందన వచ్చింది. సినిమాకొచ్చిన లాభాలలో ఐదు శాతాన్ని మూగజీవాల సంరక్షణ చూసుకునే NGO లకు మేకర్స్ డొనేట్ చెయ్యడం విశేషం. ఈ మూవీపై వినిపిస్తున్న లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ నెల 29 నుండి 777ఛార్లీ డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది.