టాలీవుడ్ సక్సెస్ఫుల్ నిర్మాత దిల్ రాజుకు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చెరొక సినిమా తీయాలని కోరిక ఉండేది. పవన్ కళ్యాణ్ తో "వకీల్ సాబ్" ను తెరక్కించి చిరకాల కోరికను తీర్చుకున్న దిల్ రాజు తదుపరి మెగాస్టార్ తో సినిమా తీసేందుకు రెడీ అవుతున్నారు.
ప్రస్తుతానికి చిరంజీవి వరస సినిమాలతో బిజీగా ఉన్నారు. 2024 సగం వరకు చిరు దిల్ రాజుకు అందే అవకాశమే లేదు. అందుకే ఆ తదుపరి చిరుతో ఒక భారీ బడ్జెట్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడట దిల్ రాజు. ఇందుకోసం ఇప్పటినుండే తీవ్ర కసరత్తులు కూడా స్టార్ట్ చేసాడు. ఒకేసారి ఆరు కధలను చిరు వద్దకు స్వయంగా తీసుకెళ్లి ఇచ్చాడట దిల్ రాజు. దీంతో మెగా సర్ప్రైజ్ ఐన చిరు ఆ ఆరు కధలను చదివే పనిలో ఉన్నారట. ఒకేసారి ఆరు స్క్రిప్ట్ లను తీసుకురావడం పట్ల దిల్ రాజుపై చిరు పొగడ్తల వర్షం కురిపించారని టాక్.
మెగాస్టార్ తో సినిమా తీయాలనే కలను సాకారం చేసుకునేందుకు దిల్ రాజు ఒకేసారి ఆరు స్క్రిప్ట్ లను సిద్ధం చెయ్యడం, ఆ ప్రాజెక్టులో ఆయన ఇంటెన్స్ ఇంటరెస్ట్ ను తెలపకనే తెలుపుతుంది. మరి ఈ విషయంలో నిజమెంతుందో తెలియాల్సి ఉంది.