తన భర్త బెనెడిక్ట్‌పై హీరోయిన్ రాధికా ఆప్టే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఫొటోలపై తన భర్తకు అస్సలు ఆసక్తి ఉండదని చెప్పింది. అందుకే తామిద్దరం కలిసి దిగిన ఫొటోలు చాలా తక్కువ అన్నారు. తమ పెళ్లికి చాలా మంది స్నేహితులను పిలిచామని, అందులో ఎక్కువ మంది ఫొటోగ్రాఫర్లు ఉన్నట్లు పేర్కొంది. అయినప్పటికీ తమ ఫొటోలు ఉండవని తెలిపింది. ఆమె ముంబైలో ఉంటుండగా, భర్త విదేశాల్లో ఉంటారు.