స్టార్ హీరోయిన్ సమంత నటించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘యశోద’ (Yashoda). ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సినిమాను రిలీజ్ కు సరిగ్గా నెలరోజులే సమయం ఉండంతో చిత్ర ప్రచార కార్యక్రమాలను కూడా షూరు చేసింది యూనిట్ . ఈ సందర్భంగా మేకర్స్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్స్ అందిస్తున్నారు. చిత్రానికి హరిశంకర్, హరీశ్ నారాయణ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై నిర్మాత శివలెంక క్రిష్ణ ప్రసాద్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ మూవీలో యశోద అనే పాత్రలో సమంత నటిస్తోంది. సమంత కేరీర్ లోనే ఈ మూవీ బిగ్ ప్రాజెక్ట్ గా రూపుదిద్దుకుంటోంది. తొలిసారిగా సమంత పాన్ ఇండియా ఫిల్మ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రం హిందీ, మలయాళం, కన్నడలోనూ డబ్డ్ వెర్షన్ లో తెరకెక్కనుంది. ఇప్పటికే సమంత అభిమానులు మూవీకోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. ‘యశోద’ టాకీ పార్ట్ ఇప్పుడే కంప్లీట్ అయ్యిందని వెల్లడించారు. ఇకపై క్రేజీ అప్డేట్స్ ను అందిస్తామని తెలిపారు. దీంతో సమంత అభిమానులు ఖుషీ అవుతున్నారు.
అప్డేట్ అందిస్తూ మేకర్స్ సమంత న్యూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పోస్టర్ లో సమంత ఇంటెన్సివ్ లుక్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికే యశోద నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ కు ఆడియెన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే చిత్రంపై భారీ హైప్ నెలకొంది. మూవీలో ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేశ్, మురళీ శర్మతో పాటు తదితర నటీనటులు పలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్గు 12న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.