టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ట్యాలెంటెడ్ హీరోయిన్ సాయిపల్లవి ఈ ఏడాది ఒకేసారి రెండు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతుంది. అదికూడా రెండు ఫిమేల్ సెంట్రిక్ సినిమాలే కావడం విశేషం.
వేణు ఉడుగుల డైరెక్షన్లో సాయి పల్లవి ప్రధాన పాత్ర పోషించిన "విరాటపర్వం" ఇప్పటికే విడుదలై ప్రేక్షకుల నీరాజనాలు అందుకోగా, ఇప్పుడు సమయం "గార్గి" ది. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషలలో జూలై 15న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రెండు బ్యాక్ టు బ్యాక్ ఫిమేల్ సెంట్రిక్ సినిమాలలో నటించడంతో కాస్తంత విసుగు చెందానని, వీలైనంత త్వరగా యాక్షన్ లేదా కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఒక ఫన్ ఫిలిం చెయ్యాలని ఉందని చెప్పుకొచ్చింది. తెలుగులో విభిన్న స్క్రిప్ట్ లు వింటున్నానని, వాటిలో ఏదైనా ఫైనలైజ్ ఐతే త్వరలోనే మరోసారి ప్రేక్షకులను పలకరిస్తానని తెలిపింది.