యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 30వ సినిమాను కొరటాల శివ డైరెక్షన్లో చెయ్యబోతున్నాడన్న విషయం తెలిసిందే. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో ఈ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసిన కొరటాల ఈ ఆగస్టు నాలుగో వారం నుండి కానీ, సెప్టెంబర్ మొదటి వారం నుండి కానీ రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళబోతున్నారట. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను వెలువరించేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నారని టాక్.
ఆచార్య డిజాస్టర్ నెగిటివిటీని ఈ సినిమాతో ఎలాగైనా తొలగించుకుని, తిరిగి సక్సెస్ బాట పట్టి ప్రేక్షకుల చేత శెభాష్ అనిపించుకోవాలనే కసితో డైరెక్టర్ కొరటాల, ఆర్ ఆర్ ఆర్ పాన్ ఇండియా సక్సెస్ ను ఈ సినిమాతో కంటిన్యూ చెయ్యాలనే విజయ కాంక్షతో తారక్... కలిసి చేస్తున్న ఈ ప్రతిష్టాత్మకమైన సినిమా ఎలాంటి ఫలితం చవిచూస్తుందా? అని ప్రేక్షకాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.