టాలీవుడ్ ఎవర్ గ్రీన్ కాంబో సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ సినిమా ఈ ఆగస్టు నుండి ప్రారంభం కాబోతుందని ఇటీవలే మేకర్స్ మేకర్స్ ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఆగస్టు రెండో వారం నుండి మొదలయ్యే ఈ మూవీ షూటింగ్ డిసెంబర్ వరకు నిర్విరామంగా జరుగుతుందట. ఈ సినిమా కోసం మహేష్ బాబు వంద రోజుల కాల్షీట్లను కేటాయించారని వినికిడి. దీంతో తమ అభిమాన హీరో, ఆయన అభిమాన డైరెక్టర్ తో చెయ్యబోయే సినిమా ఇంకొన్ని రోజుల్లోనే మొదలుకాబోతుందని సూపర్ స్టార్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ కాగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై మమత ఈ సినిమాను సమర్పిస్తున్నారు.