ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టాకీ షూట్ ను పూర్తి చేసుకున్న సమంత "యశోద"

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 11, 2022, 01:16 PM

హరి శంకర్, హరీష్ నారాయణ్ ల దర్శకద్వయం తెరకెక్కిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ "యశోద". సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావురమేష్, మురళీశర్మ, సంపత్ రాజ్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్డేట్ ఒకటి మేకర్స్ ఎనౌన్స్ చేసారు. అదేంటంటే.., ఈ మూవీ షూటింగ్ కు సంబంధించి ఒక్క పాట మినహా టాకీ పార్ట్ ను మొత్తం పూర్తి చేసినట్టు అఫీషియల్గా ఎనౌన్స్ చేసారు. ఇక మీదటి నుండి డబ్బింగ్, ఎఫెక్ట్స్ వంటి పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టబోతున్నట్టు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 12న ఈ సినిమా ధియేటర్లలలో విడుదల కాబోతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com