మాస్ ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు దర్శకుడు హరీశ్ శంకర్. ప్రస్తుతం ఆయన పవన్ కల్యాణ్ తో చేయనున్న భవదీయుడు భగత్ సింగ్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. తాజాగా హీరో రామ్ తో త్వరలోనే సినిమా చేయనున్నట్లు వెల్లడించారు. ఆదివారం రాత్రి జరిగిన ది వారియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రామ్ తో తప్పకుండా సినిమా చేస్తానని, అయితే దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడే చెప్పలేనన్నారు.