ప్రస్తుతం టాలీవుడ్ నుంచి టైర్ 1 స్టార్ హీరోస్ సినిమాలు నుంచి కాకుండా టైర్ 2 యంగ్ హీరోస్ పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్ రేపేందుకు సిద్ధంగా ఉన్న కొన్ని చిత్రాలు ఉన్నాయి. ఆ చిత్రాల్లో అక్కినేని వారి యంగ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబోలో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ “ఏజెంట్” కూడా ఒకటి.ఎప్పుడు నుంచో మంచి అంచనాలు నెలకొన్న ఈ సినిమా నుంచి అవైటెడ్ టీజర్ ని మేకర్స్ అనౌన్స్ చెయ్యగా ఇప్పుడు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఈ సినిమా టీజర్ ఎలా ఉంటుంది అనే ఉత్సుకత అందరిలో ఓ రేంజ్ లో పెరిగిపోతుంది. మరి దర్శకుడు సురేందర్ రెడ్డి అయితే ఈ క్రేజీ స్పై థ్రిల్లర్ ని ఏ లెవెల్లో ప్లాన్ చేసారో తెలియాలి అంటే రేపటి వరకు ఆగాల్సిందే. అలాగే రీసెంట్ గా రిలీజ్ చేసిన మమ్ముట్టి పోస్టర్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa