ట్రెండింగ్
Epaper    English    தமிழ்

థియేటర్లలో యాభై రోజులను పూర్తి చేసుకున్న సమ్మర్ సోగ్గాళ్లు

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 15, 2022, 02:07 PM

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో స్టార్ హీరోలు వెంకటేష్, వరుణ్ తేజ్ లు కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం ఎఫ్ 2. 2018లో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ గా ఎఫ్ 3 ను తెరకెక్కించారు. ఎఫ్ 2 లో లీడ్ రోల్స్ చేసిన వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ లే ఎఫ్ 3 లో కూడా లీడ్ రోల్స్ చేసారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు .
వేసవి కానుకగా మే 27న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కరోనా తర్వాత థియేటర్లకు రావాలంటే భయపడుతున్న ఫ్యామిలీ ఆడియన్స్ ను ఈ చిత్రం థియేటర్లకు రప్పించింది. కొత్త సినిమాల రాకతో థియేటర్లలో కొంచెం స్లో ఐన ఈ మూవీ ఇటీవలే డిజిటల్ రంగంలో సందడి చెయ్యడం ప్రారంభించింది. లేటెస్ట్ గా ఈ మూవీ థియేటర్లలో యాభై రోజులను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఆంధ్రా, తెలంగాణాలలో మొత్తం పది థియేటర్లలో యాభై రోజులను పూర్తి చేసుకుంది ఈ చిత్రం. ఈ మేరకు మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa