పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బిజినెస్ ప్లానింగ్‌లో బిజిగా ఉన్నారని వార్తలొస్తున్నాయి. ప్రభాస్ హోటల్ బిజినెస్ వైపు ఎక్కువ ఇంటస్ట్ర్ చూపుతున్నట్లు సోషల్‌మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ప్రభాస్ ఈ బిజినెస్‌ను మనదేశంలోనే కాకుండా.. ఇటలీ, స్పెయిన్, దుబాయ్ వంటి దేశాల్లో కూడా పెట్టాలని చూస్తున్నాడట. మన తెలుగు రుచులను విదేశీయులకు రుచి చూపించాలన్నదే ప్రభాస్ కోరిక అని మీడియాలో టాక్.