సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీ కాంత్ ను తన గురువుగా భావిస్తుంటారు ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్. ఈ విషయాన్ని పలు బహిరంగ వేదికలపైన లారెన్స్ ప్రకటించారు. తాజాగా మరోసారి రజనీకాంత్ నివాసానికి వెళ్ళి ఆశీస్సులు తీసుకున్నారాయన. రజనీ హీరోగా నటించిన చంద్రముఖి సీక్వెల్ లో లారెన్స్ నటించనున్నారు. రజనీ ఆశీస్సులు తీసుకుని శుక్రవారం నుంచి షూట్‌లో పాల్గొంటున్నట్లు లారెన్స్ ట్వీట్ చేశారు.