సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ట్యాలెంటెడ్ హీరోయిన్స్ లో మల్లూ బ్యూటీ నిత్యామీనన్ ఒకరు. తన పాత్ర, మూవీ కాన్సెప్ట్ నచ్చితే, ఏ చిన్న సినిమాలో నటించడానికైనా సిద్ధపడే నిత్యా మొదటి నుండి గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ వస్తుంది. ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో "భీమ్లానాయక్", "మోడరన్ లవ్ హైదరాబాద్" అనే వెబ్ సిరీస్ లో నటించిన నిత్యా తదుపరి ఏ కొత్త సినిమాలకు సైన్ చెయ్యలేదు. ఇందుకు కారణంగా నిత్యా పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు బలంగా వినపడుతున్నాయి.
మలయాళ యంగ్ హీరోతో ప్రేమలో ఉన్న నిత్యా త్వరలోనే అతనితో కలిసి ఏడడుగులు నడవబోతుందట. ఈ మేరకు ఇరువురు తమ కుటుంబ సభ్యులను ఒప్పించి, వారి ఆధ్వర్యంలో ఒకటవ్వబోతున్నట్టు తెలుస్తుంది. సైలెంట్ గా పెళ్లి పనులు కూడా జరుగుతున్నాయని టాక్. అందుకే నిత్యా తన నెక్స్ట్ ప్రాజెక్టులను ప్రకటించేలేదట. మరి ఈ వార్తలపై నిత్యా ఎలా స్పందిస్తుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa