నేషనల్ క్రష్ రష్మికకు "పుష్ప" తెచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. అప్పటివరకు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉన్న రష్మిక పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపొయింది. ఈ సినిమా ఇచ్చిన క్రేజ్ తో బాలీవుడ్ లో వరస సినిమా అవకాశాలను చేజిక్కించుకుంది.
ఈ క్రమంలో రష్మిక , బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించిన చిత్రం "గుడ్ బై". కొన్నిరోజుల కృతమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. లేటెస్ట్ గా ఈ చిత్రం రిలీజ్ డేట్ ను మేకర్స్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేసారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం అక్టోబర్ 7వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది.
వికాస్ బహెల్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, రష్మిక మండన్నా, నీనా గుప్త, శివిన్ నారంగ్ తదితరులు నటిస్తుండగా, బాలాజీ మోషన్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa