బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ నటించిన "లాల్ సింగ్ చడ్డా" సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఆగస్టు 11వ తేదీన విడుదల కాబోతున్న ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ అటు బాలీవుడ్లో, ఇటు టాలీవుడ్లో జోరుగా జరుగుతున్నాయి. ఈ మేరకు చిరు, ఆమీర్ కలిసి పలు ఇంటర్వ్యూలలో, ప్రెస్ మీట్లలో పాల్గొంటున్నారు.
ఐతే, ఈ చిత్రం పట్ల బాలీవుడ్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎందుకంటే, 2015లో ఆమిర్ చేసిన దేశ వ్యతిరేక వ్యాఖ్యలను జనాలు ఇప్పుడు తెరమీదకు తీసుకొచ్చి, బాయ్ కాట్ లాల్ సింగ్ చడ్డా అంటూ సోషల్ మీడియాలో ఈ సినిమా పట్ల తీవ్ర వ్యతిరేకతను చూపిస్తున్నారు. దేశ ప్రజల మనోభావాలు తెలియదన్నట్టు, దేశం పట్ల ప్రజలకున్న ప్రేమాభిమానాలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న కొంతమంది టాలీవుడ్ హీరోల వ్యవహార శైలిని తప్పు పడుతూ సీనియర్ హీరోయిన్ విజయశాంతి వరస ట్వీట్లు చేసారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. ఇన్ డైరెక్ట్ గా చిరు, నాగ్ లను విజయశాంతి నిలదీసిందని తెలియకనే తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa