హీరోయిన్ కాజల్ అగర్వాల్ తాజాగా షేర్ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బాహుబలి సినిమాలో కట్టప్ప తలపై బాహుబలి కాలుపెట్టే సీన్‌ని కాజల్ తన కొడుకు నీల్‌తో రీక్రియేట్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ.. 'రాజమౌళి సర్ ఇది నీల్, నేను మీకు అంకితమిస్తున్నాం' అంటూ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.