నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య ఒక కొత్త పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. అయితే ప్రస్తుతం బాలకృష్ణ 107వ సినిమా గోపీచంద్ మలినేని డైరెక్షన్లో చేస్తున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయినిగా నటిస్తుంది.