రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం రైతులకు నిజమైన భరోసా ఇచ్చిందని ఆహారం, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. 2024–25 ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ద్వారా చేపట్టిన 31,52,753 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకుగాను రూ.7,222.35 కోట్లు చెల్లించామని వెల్లడించారు. తద్వారా 5,00,352 మంది రైతులకు లబ్ధి చేకూరిందని తెలిపారు. "ఇదీ... మా ప్రభుత్వం సాధించిన ఘనత అని సంతోషంగా చెబుతున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రైతుల క్షేమం కోసం నిరంతరం ఆలోచిస్తుంటారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ" అని నాదెండ్ల ట్వీట్ చేశారు. ఈ మేరకు ధాన్యం కొనుగోళ్ల గ్రాఫ్‌ను కూడా పంచుకున్నారు.