సత్య, విర్తి వఘని జంటగా హనుమాన్ వరంశెట్టి డైరెక్షన్లో తెరకెక్కుతున్న అందమైన ప్రేమ కథా చిత్రం "కొత్తకొత్తగా". ఫన్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై BG గోవిందరాజు సమర్పిస్తున్న ఈ సినిమాను మురళీధర్ రెడ్డి ముక్కరా నిర్మిస్తున్నారు.
లేటెస్ట్ గా మేకర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ మేరకు ఈ సినిమా సెప్టెంబర్ 9వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది.
పోతే, ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తుండగా, కృష్ణ చైతన్య, అనంతశ్రీరామ్, శ్రీమణి, కాసర్ల శ్యామ్ సాహిత్యమందించారు.