ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెయిజింగ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో 'జై భీమ్'

cinema |  Suryaa Desk  | Published : Sat, Aug 20, 2022, 09:18 PM

TJ జ్ఞానవేల్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన 'జై భీమ్' సినిమా ఇప్పటికీ ప్రశంసలు అందుకుంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులు మరియు సెలబ్రిటీల నుండి అనేక  ప్రశంసలను అందుకుంది. తాజా అప్డేట్ ప్రకారం, ఈ కోర్ట్‌రూమ్ డ్రామా ప్రతిష్టాత్మకమైన బీజింగ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రసారం చేయబడింది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా అండ్ ఇంటర్నెట్ లో వైరల్‌గా మారాయి. నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 'జై భీమ్' 3 అవార్డులను కైవసం చేసుకుంది. ఆస్కార్స్ మరియు గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు కూడా నామినేట్ అయింది. ఈ లీగల్ డ్రామాలో రావు రమేష్, రజిషా విజయన్, లిజోమోల్ జోస్, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై జ్యోతిక, సూర్య ఈ సినిమాని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa