టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి వేగంగా సినిమాలు చేసే డైరెక్టర్ అని పూరి జగన్నాధ్ కు చాలా మంచి పేరుంది. ఐతే, పూరి "లైగర్" మూవీకి దాదాపు రెండున్నరేళ్ల సమయం తీసుకున్నారు. ఈ సినిమా ఈ రోజే విడుదలై మంచి టాక్ తో రన్ అవుతుంది.
లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ సినిమాను 2016లోనే తెరకెక్కించే ప్లాన్ చేశారట పూరి. అదికూడా సూపర్ స్టార్ మహేష్ బాబుతో. కానీ కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల మహేష్ ఈ మూవీని రిజెక్ట్ చేశారట. అప్పుడు అటకెక్కిన ఈ మూవీ తిరిగి 2019లో మొదలై ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ సంయుక్త బ్యానర్లపై కరణ్ జోహార్, పూరి జగన్నాధ్, చార్మీ నిర్మించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, విషురెడ్డి, మకరంద్ దేశ్ పాండే, చుంకీ పాండే కీలక పాత్రలు పోషించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa