దేశవ్యాప్త ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న పుష్ప 2 సినిమాకు సంబంధించి ఇటీవలే పూజా కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. ఇంకొన్నాళ్ల వరకు సరైన ముహుర్తాలు లేకపోవడంతో హీరో, హీరోయిన్లు అందుబాటులో లేకున్నప్పటికీ దర్శకనిర్మాతలే ఈ పూజా కార్యక్రమానికి హాజరై త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు.
లేటెస్ట్ గా పుష్ప 2 సినిమాకు సంబంధించి మూడు పాటలు రెడీ అయినట్టు తెలుస్తుంది. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో దేవిశ్రీప్రసాద్ ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేకాక పుష్ప కి మించి పుష్ప 2 ఉండబోతుందని, పుష్ప 2 స్క్రిప్ట్ విని తను చాలా ఎక్జయిటింగ్ గా ఫీల్ అయ్యానని తెలిపారు.
పోతే, ఈ చిత్రం సెప్టెంబర్ మూడవ వారం నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతుందని అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa