ట్రెండింగ్
Epaper    English    தமிழ்

USA టాప్ 5 గ్రాసర్ గా నిఖిల్ "కార్తికేయ 2"

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 30, 2022, 06:40 PM

ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే పాజిటివ్ మాత్ టాక్ తో కార్తికేయ 2 థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులతో కళలాడిపోతున్నాయి. ఆగస్టు 13వ తేదీన విడుదలైన ఈ చిత్రం మూడవ వారంలో కూడా బాక్సాఫీస్ రాంపేజ్ చేస్తుంది.
నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ చిత్రం ఒక్క సౌత్ లోనే కాక నార్త్ లో కూడా భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. అదేవిధంగా USA లో కూడా 1.5 మిలియన్ డాలర్ల వసూళ్లతో టాప్ 5 గ్రాసర్ గా నిలిచింది. ఈ లిస్టులో RRR, రాధేశ్యామ్, సర్కారువారిపాట, భీమ్లానాయక్ సినిమాలు మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. స్టార్ హీరోల సరసన టైర్ 2 హీరో నిలవడం విశేషం. ఐతే, కార్తికేయ 2 కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
చందు మొండేటి డైరెక్షన్లో ఇండియాస్ మిస్టికల్ యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa