ట్రెండింగ్
Epaper    English    தமிழ்

AAGMC : 'ఆ మెరుపేమిటో' లిరికల్ సాంగ్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 30, 2022, 06:43 PM

సుధీర్ బాబు, యంగ్ బ్యూటీ కృతి శెట్టి జంటగా, ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి". సెప్టెంబర్ 16వ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతుంది.
కొంచెంసేపటి క్రితమే ఈ సినిమా నుండి ఆ మెరుపేమిటో అనే లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించగా, లేట్ సిరివెన్నెల గారు సాహిత్యమందించారు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతమందించారు. లిరికల్ సాంగ్స్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ పై మంచి అంచనాలే ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa