నాగశేఖర్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో సత్యదేవ్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా జోడిగా నటిస్తుంది. ఈ చిత్రానికి 'గుర్తుందా సీతకాలం' అనే టైటిల్‌ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. గతంలో ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 9న విడుదల చేయనున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా విడుదల సెప్టెంబర్ 23కి వాయిదా పడినట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సత్యదేవ్ మరియు తమన్నా కలిసి ఉన్న ఒక కూల్ రొమాంటిక్ పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రం కన్నడ హిట్ చిత్రం లవ్ మోక్‌టెయిల్‌కి అధికారిక రీమేక్. ఈ చిత్రానికి MM కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం అందించారు. రొమాంటిక్ డ్రామా ట్రాక్ లో రానున్న ఈ సినిమాని నాగశేఖర్ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa