మహేశ్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్నఎస్ఎస్ఎమ్ బి 28 పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్నప్పటికీ, షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. అయితే ఈ సినిమా గురించి రోజుకో గాసిప్ టాలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇటీవల ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం టాలీవుడ్ హీరో తరుణ్‌ని తీసుకోనున్నట్లు పెద్ద ఎత్తున గుసగుసలు వినిపించాయి. ఇది కాస్తా హీరో తరుణ్ వరకు చేరడంతో దీనిపై ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే ఇటీవల ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం టాలీవుడ్ హీరో తరుణ్‌ని తీసుకోనున్నట్లు పెద్ద ఎత్తున గుసగుసలు వినిపించాయి. అదే నిజమైతే త్రివిక్రమ్ తరుణ్ కి మళ్ళీ లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది అని చర్చలు నడిచాయి. ఇది కాస్తా హీరో తరుణ్ వరకు చేరడంతో దీనిపై ఒక క్లారిటీ ఇచ్చారు. తనని ఎవరు ఏ సినిమా కోసం సంప్రదించలేదని, అలాంటిది ఉంటే తానే నేరుగా చెబుతానని తెలిపారు.ఇక ఎస్ఎస్ఎమ్ బి 28 రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ‘సర్కారు వారి పాట’ ఘన విజయం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. 2023 సమ్మర్ కి విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.