ప్రతీ సంవత్సరం జరిగే పాపులర్ సినీ అవార్డుల కార్యక్రమం ఫిలింఫేర్ అవార్డ్స్ తాజాగా తన 67వ అవార్డ్స్ కార్యక్రమాన్ని మంగళవారం రాత్రి ముంబైలో జరుపుకుంది. బాలీవుడ్ తారలంతా ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు. ఈ సారి అవార్డుల్లో దేశభక్తికే చోటు దక్కింది. దేశభక్తిని చాటిచెప్పిన సర్దార్ ఉదమ్, షేర్షా సినిమాలు ఎక్కువ అవార్డులు దక్కించుకున్నాయి. విక్కీ కౌశల్ ముఖ్యపాత్రలో నటించిన సర్దార్ ఉదమ్ సినిమా అత్యధికంగా 9 అవార్డులు దక్కించుకుంది. ఆ తర్వాత
సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ నటించిన షేర్షా సినిమా 7 అవార్డులను సాధించింది. కృతి సనన్ ముఖ్యపాత్రలో నటించిన మిమీ సినిమా మూడు అవార్డులను సాధించింది. 67 వ ఫిలింఫేర్ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా షేర్షా సినిమా నిలిచింది. ఉత్తమ దర్శకుడిగా షేర్షా సినిమాకు గాను విష్ణువర్ధన్ అందుకున్నారు. 83 సినిమాకి రణవీర్ సింగ్ ఉత్తమ నటుడు, మిమీ సినిమాకి కృతి సనన్ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. క్రిటిక్స్ ఛాయస్ లో విక్కీయ్ కౌశల్ సర్దార్ ఉదమ్ సినిమాకి బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నాడు.