విక్రమ్ హీరో నటించిన మూవీ కోబ్రాఈ మూవీతో ప్రేక్షకుల ముందుకు వినాయక చవితి సందర్భంగా ఆగస్ట్ 31న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతుంది. అన్ని వర్గాల నుంచి ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. ఇందులో విక్రమ్ గణిత శాస్త్రవేత్తగా కనిపించగా.. శ్రీనిథి, మీనాక్షి, మృణాళిని కథానాయికలుగా నటించారు. కోబ్రా సినిమాతో మరోసారి విక్రమ్ తన నట విశ్వరూపం చూపించారంటూ టాక్ వినిపిస్తోంది అయితే ఈ మూవీ రిలీజ్ సందర్భంగా ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించిన విక్రమ్.. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే తమిళ్ స్టార్ విజయ్ దళపతితో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా చెప్పారు. అంతేకాదు. విజయ్, తన కాంబోలో రాబోయే చిత్రాన్ని డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించాలని తెలిపారు. ఇక ఇదే విషయంపై డైరెక్టర్ అజయ్ స్పందిస్తూ.. వీరిద్దరు కలిసి నటించిన సినిమా చూసేందుకు టికెట్ తీసుకునే మొదటి అభిమాని తానేనంటూ చెప్పుకొచ్చారు.