యాంకర్ సుమ. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఓవైపు రియాల్టీ షోలు మాత్రమే కాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్స్.. సక్సెస్ మీట్స్ అంటూ ఎప్పుడు బిజీ బిజీగా గడిపేస్తుంది. ఇటీవల శ్రావణమాసంలో వరలక్ష్మీ వ్రంత సందర్భంగా పట్టుచీరల షాపింక్ కోసం ఓ మాల్‌కు వెళ్లింది సుమ. అక్కడ చీరల ధరలు అడుగుతునే తన స్టైల్లో పంచులు వేసింది. తనకు కేవలం రూ. 15 వేల లోపు పట్టుచీరలు మాత్రమే కావాలని అడగ్గా.. మీ రేంజ్ కాదని బదులిచ్చాడు సేల్స్ మెన్. దీంతో మేము అంతే తీసుకుంటామంటూ మరో సెటైర్ వేసింది. ఆ తర్వాత షాపింగ్ మాల్ మొత్తం తిరుగుతూ చీరలు.. వాటి డిజైన్స్.. ధరల గురించి అడిగి తెలుసుకుంది. అయితే ఓ చీరను ముచ్చటపడి దాని ధరను అడగడంతో.. అతను రూ. 2 లక్షలకు పైనే అని చెప్పాడు. దీంతో షాకైన సుమ.. ఇది చీరల షాపా.. బంగారం షాపా.. నా పెళ్లికి కూడా ఇంత కాస్ట్ లీ చీర కట్టలేదు. తన పెళ్లి చీర కేవలం రూ. 11 వేలు మాత్రమే అంటూ రివీల్ చేసింది. యాంకర్‌గా కెరీర్ ప్రారంభించకముందు సుమ.. నటిగా.. పలు సీరియల్స్, సినిమాలలో నటించింది. ప్రముఖ నటుడు రాజీవ్ కనకాలతో సుమ 1999 ఫిబ్రవరి 10న పెళ్లి జరిగింది. వీరికి ఒక బాబు, పాప ఉన్నారు.