బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా ఆలియా భట్ హీరోయిన్ గా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా “బ్రహ్మాస్త్ర” కోసం అందరికీ తెలిసిందే. భారీ స్థాయిలో అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమా ఓపెనింగ్స్ కూడా భారీ మొత్తంలోనే ఉంటాయని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తుండగా ఈ సినిమా బుకింగ్స్ పరంగా సెన్సేషన్ ని నమోదు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
పాపులర్ సినిమా స్క్రీన్స్ అయినటువంటి పీవీఆర్ మల్టీ ప్లెక్స్ లలో ఈ సినిమా ఇప్పటికే లక్షకి పైగా టికెట్స్ అమ్ముడు పోయాయని కన్ఫర్మ్ అయ్యింది. ఇక దీనిని బట్టి సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ భారీ విజువల్ చిత్రంలో బిగ్ బి అమితాబ్, కింగ్ నాగార్జున, షారుఖ్ ఖాన్ తదితరులు కీలక పత్రాలు పోషించగా ఈ సెప్టెంబర్ 9న ఈ చిత్రం ఇంటర్నేషనల్ వైడ్ రిలీజ్ కాబోతుంది.
![]() |
![]() |