అక్కినేని అమల చాన్నాళ్ల తరవాత వెండితెరపై కనిపించబోతుంది. శర్వానంద్ హీరోగా నటిస్తున్న 'ఒకేఒక జీవితం'లో అమల కీరోల్ ప్లే చేస్తుంది. సెప్టెంబర్ 9వ తేదీన తెలుగు, తమిళ భాషలలో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం హైదరాబాద్లోని JRC కన్వెన్షన్స్ హాల్ లో జరగబోతుంది. ఈ ఈవెంట్ కు అఖిల్ అక్కినేని చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నారు.
రీతూవర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీ కార్తిక్ దర్శకుడు. వెన్నెల కిషోర్, ప్రియదర్శి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. డ్రీం వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రకాష్ బాబు, ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
![]() |
![]() |