కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్రమ్, 'కేజీఎఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టి జంటగా నటించిన చిత్రం "కోబ్రా". ఆగస్టు 31న విడుదలైన ఈ చిత్రం డీసెంట్ కలెక్షన్లను రాబడుతుంది. లేటెస్ట్ గా ఈ సినిమా నుండి తరంగిణి అనే ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ అయ్యింది. AR రెహ్మాన్ స్వరకల్పనలో రూపొందిన ఈ పాటను సార్థక్ కళ్యాణి, మీరా సెన్గుప్తా ఆలపించగా, రాకేందు మౌళి లిరిక్స్ అందించారు.
R. అజయ్ జ్ఞానముత్తు డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని SS లలిత్ కుమార్ నిర్మించారు. ఇంకా ఈ సినిమాలో మాజీ ఇండియన్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, KS రవికుమార్, రోబో శంకర్, మియా జార్జ్, మృణాళిని రవి, మీనాక్షి గోవిందరాజన్ కీలకపాత్రలు పోషించారు.
![]() |
![]() |