మాస్ మహరాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం “అమర్ అక్బర్ ఆంటోని”. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ఇలియానా కథానాయికగా నటిస్తోంది. కాగా ఈ రోజు ఇలియానా బర్త్ డే సందర్భంగా అమ్మడి పోస్టర్ ను చిత్రబృందం విడుదల చేశారు. కొత్త హెయిర్ స్టైల్ తో చాలా కొత్త మేకోవర్ తో ఇలియానా ఈ పోస్టర్ లో కనిపిస్తోంది. తప్పకుండా ఇలియానా ఈ సినిమాకు ప్లస్ అవుతుందనే టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రంలో మొదట అను ఎమాన్యూల్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. ఏవో కారణాల వల్ల సినిమా నుండి అనును తొలగించి ఇలియానాను ఎంపిక చేయడం జరిగింది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa