రాజమౌళి దర్శకత్వంలో అగ్రహీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తో ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మల్టీ స్టారర్ చిత్రం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 11న ఉదయం 11 గంటలకు ఈ సినిమా ప్రారంభోత్సవ ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలిపింది. కాగా, డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం వర్కింగ్ టైటిల్ ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రం టైటిల్ ను, విడుదల తేదీని ఈ సినిమా ప్రారంభం రోజునే ప్రకటిస్తారని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa