విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీ స్టారర్‌గా ‘ఎఫ్-2 -ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్లో దిల్ రాజు నిర్మిస్తున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ఇందులో వెంకటేష్, వరుణ్ తేజ్ రైల్వే కూలీలుగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. వెంకీ కూలీ నెం.1గా, వరుణ్ తేజ్ కూలీ నెం. 786గా కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో వెంకీ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ ఫిర్జాదా నటిస్తున్నారు. అయితే ఈ ఇద్దరూ సినిమా మొత్తం కూలీలుగా కనిపించబోతున్నారా? లేక ఏదైనా సన్నివేశానికే పరిమితమా? అనేది తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa