టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ నుండి వచ్చిన మూడవ సినిమా "సింధూరం". 1997, సెప్టెంబర్ 12న విడుదలైన ఈ చిత్రం ఈ రోజుతో పాతికేళ్ళను పూర్తి చేసుకుంది. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఈ సినిమా ఒక కల్ట్ క్లాసిక్ గా నిలిచింది.
బ్రహ్మాజీ, రవితేజ, సంఘవి ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ నక్సలిజం నేపథ్యంలో క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కింది. అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. బెస్ట్ ఫీచర్ ఫిలిం గా నేషనల్ అవార్డును పొందడమే కాక ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈవెంట్ లో కూడా ప్రదర్షింపబడింది. అంతేకాక ఐదు నంది అవార్డులను కూడా గెలుచుకుంది.
ఈ సినిమాలోని పాటలు కూడా చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. శ్రీనివాస్ చక్రవర్తి ఈ సినిమాకు సంగీతం అందించారు. ముళ్ళపూడి మోహన్ నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa