నివేద థామస్, రెజీనా కస్సాండ్రా లీడ్ రోల్స్ లో నటిస్తున్న చిత్రం "శాకినీ డాకిని". సెప్టెంబర్ 16వ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతుంది.
లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. టీజర్ తో ఈ సినిమా ఎంత ఫన్ గా ఉంటుందో చూపించిన మేకర్స్ ట్రైలర్ తో ఈ సినిమాలో ఎంతటి ఎంగేజింగ్ కంటెంట్ ఉంటుందో చిన్న శాంపిల్ చూపించారు. శాకినీ డాకిని ల మధ్య అదేనండి... శాలిని దామినీల మధ్య జరిగే చిన్న చిన్న ఫైట్స్, సెటైర్లు, తదుపరి ఇద్దరు కూడా అనుకోకుండా ఒక అమ్మాయిని కాపాడడం, ఆ అమ్మాయినే కాదు ఏ అమ్మాయిని చూసినా వాళ్ళకి అమ్మోరు గుర్తుకు రావాలని ఒక మిషన్ పై వర్క్ చెయ్యడం... ట్రైలర్ చాలా గ్రిప్పింగ్ గా సాగింది. దీంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి మీకీ MC క్లీరి సంగీతం అందించారు. సెప్టెంబర్ 16వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ మూవీని డి సురేష్ బాబు, సునీత తాటి నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa