అనుకున్నట్టుగానే ఈ రోజు గాడ్ ఫాదర్ ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చింది. అదికూడా మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ లు కలిసి కాలు కదిపే పాట కావడంతో మెగా ఫ్యాన్స్ సూపర్ ఎక్జయిటింగ్ గా ఫీల్ అవుతున్నారు. ఇంకొన్ని గంటల్లోనే ఈ ఎక్జయిట్మెంట్ రెట్టింపు కాబోతుంది. ఎందుకంటే సాయంత్రం 04:05 గంటలకు ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ కాబోతుంది. పోతే, ఫుల్ లిరికల్ సాంగ్ ఎల్లుండి సాయంత్రం 04:05 గంటలకు విడుదల కాబోతుంది.
మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకుడు కాగా, లేడీ సూపర్ స్టార్ నయనతార, విలక్షణ నటుడు సత్యదేవ్, సునీల్, పూరి జగన్నాధ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa