శర్వానంద్, రీతువర్మ జంటగా, కొత్త దర్శకుడు శ్రీ కార్తీక్ డైరెక్షన్లో తెరకెక్కిన ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ "ఒకేఒక జీవితం". ఇందులో అక్కినేని అమలగారు కీలకపాత్రను పోషించి, సినిమాకు స్ట్రాంగ్ పిల్లర్ లా నిలిచారు.
గత శుక్రవారం విడుదలైన ఈ మూవీ తొలిషోతోనే హిట్ టాక్ అందుకుంది. ప్రేక్షకులు, క్రిటిక్స్ యునానిమస్ గా ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూ ఇస్తున్నారు. లేటెస్ట్ గా ఈ సినిమాను చూసిన నాచురల్ స్టార్ నాని ట్విట్టర్ లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. శర్వానంద్, అక్కినేని అమల గారి ఎమోషనల్ యాక్టింగ్ అమేజింగ్ గా ఉంది... హీరోయిన్ రీతువర్మ, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, చైల్డ్ ఆర్టిస్టులు ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. అమ్మ సాంగ్ సినిమాకు ప్రాణం పోసింది... అంటూ ఒకేఒకేజీవితం సినిమా బృందానికి నాని కంగ్రాట్యులేషన్స్ తెలియచేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa