ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'బ్రాహ్మాస్త్ర' 3 రోజుల కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 13, 2022, 06:30 PM

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన 'బ్రహ్మాస్త్ర' సినిమా సెప్టెంబర్ 9, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో విడుదలయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ రివ్యూస్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 8.49 కోట్లు వసూలు చేసింది.


ఈ చిత్రంలో రణబీర్ కపూర్ సరసన బాలీవుడ్ బ్యూటీ క్వీన్ అలియా భట్ జంటగా నటించారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, మౌని రాయ్, అండ్ నాగార్జున అక్కినేని కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రం  హిందీ, తమిళం, తెలుగు, మలయాళం అండ్  కన్నడ భాషలలో విడుదల అయ్యింది. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ అండ్ స్టార్‌లైట్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.


'బ్రాహ్మాస్త్ర' కలెక్షన్స్ ::::
నైజాం : 4.19 కోట్లు
సీడెడ్ : 95 L
UA : 94 L
ఈస్ట్ : 64 L
వెస్ట్ : 41 L
గుంటూరు : 67 L
కృష్ణ : 40 L
నెల్లూరు : 29 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 8.49 కోట్లు (16.05 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa