లేటెస్ట్ గా టాలీవుడ్ లో రిలీజ్ అయ్యి కంటెంట్ తో కొట్టిన మరో చిత్రం “ఒకే ఒక జీవితం”. టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ హీరోగా అమల అక్కినేని కీలక పాత్రలో వెన్నెల కిషోర్ మరియు ప్రియదర్శి లు నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రం పెద్దగా ప్రమోషన్స్ లేకుండానే రిలీజ్ కాగా యూఎస్ లో చాలా తక్కువ ఓపెనింగ్స్ తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు భారీ వసూళ్లతో అదరగొడుతుంది.లేటెస్ట్ గా ఈ చిత్రం 3 లక్షల 50 వేల డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసి ఆ సెన్సేషనల్ రన్ ని అయితే స్ట్రాంగ్ గా కొనసాగిస్తోంది. దీనితో ఈ ఏడాది మరో సాలిడ్ హిట్ గా ఈ చిత్రం నిలిచింది. ఇక ఈ చిత్రాన్ని తమిళ్ లో కూడా “కణం” పేరిట ఏక కాలంలో రిలీజ్ చెయ్యగా ఈ ఎమోషనల్ మరియు స్కై ఫై థ్రిల్లర్ ని డ్రీం వారియర్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa