టిప్పు, పడేసావే, కౌశల్యా కృష్ణమూర్తి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు కార్తీక్ రాజు. ఆయన హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం "అధర్వ".
ఈ రోజే ఈ మూవీ నుండి కార్తీక్ ఫస్ట్ లుక్ విడుదలయింది. ఇందులో కార్తీక్ ఇంటెన్స్ లుక్ ఎంగేజింగ్ గా, ఇంటరెస్టింగ్ గా ఉంది. ఈ సినిమాను మహేష్ రెడ్డి డైరెక్ట్ చేస్తుండగా, పెగ్గో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నూతలపాటి సుభాష్ నిర్మిస్తున్నారు.
శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి, కల్పిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa