విక్టరీ వెంకటేష్ కెరీర్ లో తొలి సిల్వర్ జూబ్లీ హిట్ మూవీ "బొబ్బిలి రాజా". సెప్టెంబర్ 14, 1990లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో మూడు సెంటర్లలో 175 రోజులు ఏకధాటిగా రన్ అయ్యి, ఆల్ టైం బ్లాక్ బస్టర్ లిస్టులోకి దర్జాగా ఎంటర్ అయ్యింది.
పరుచూరి బ్రదర్స్ సహాయంతో బి. గోపాల్ ఈ మూవీ స్క్రిప్ట్ ను సిద్ధం చేసి డైరెక్ట్ చేసారు. ఈ సినిమాతోనే లేట్ దివ్యభారతి తెలుగు సినీరంగ ప్రవేశం చేసింది. ఈ సినిమాకు ఇళయరాజా అందించిన సంగీతం ఆయనకు ఫిలింఫేర్ అవార్డును తీసుకొచ్చింది.
సీనియర్ నటులు వాణిశ్రీ, సత్యనారాయణ, గుమ్మడి, కోట శ్రీనివాసరావు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ నేటితో సరిగ్గా 32 ఏళ్ళ వసంతాలు పూర్తి చేసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa