కృష్ణంరాజుతో తనకు ఎంతో అనుబంధం ఉందని మోహన్ బాబు గుర్తుచేసుకున్నారు. ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ లో నిర్వహించిన సంతాప సభలో మాట్లాడుతూ.. 'నన్ను ఒరేయ్ అనే ఆప్యాయంగా పిలిచే వ్యక్తి కృష్ణంరాజు. నన్ను జీవితంలో మొదటిసారి బెంజికారు ఎక్కించింది ఆయనే. కృష్ణంరాజు నుంచి ఎన్నో నేర్చుకున్నా. గొప్ప నటుడు, నిర్మాతను మనం కోల్పోయాం. ఆయన ఎక్కడున్నా ఆత్మకు శాంతి కలగాలని సకల దేవుళ్లను కోరుకుంటున్నా' అని పేర్కొన్నారు.
![]() |
![]() |