నాగశౌర్య, బాలీవుడ్ నటి మరియు గాయకురాలు షిర్లీ సెటియా జంటగా నటించిన "కృష్ణ వ్రింద విహారి" సినిమా నుండి కొంచెంసేపటి క్రితమే టైటిల్ సాంగ్ విడుదలైంది. రామ్ మిర్యాల గాత్రంలో ఈ పాట ఒక ప్రేమికుడి కష్టాలను చాలా సింపుల్ గా తెలియచేస్తుంది. కాసర్ల శ్యామ్ సింపుల్ అండ్ క్యాచీ లిరిక్స్ ను అందించారు. గుడుగుడు గుంజం గోవిందా టార్చర్ ఇట్లా ఉంటుందా... నేనే పడ్డ ఈ గొయ్యి... నాకోసం నే తవ్విందా... అనే ఈ పాటకు మహతి స్వర సాగర్ రిథమాటిక్ మ్యూజిక్ ను కంపోజ్ చేసారు.
అనీష్ ఆర్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 23న ఇరు తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా కోసం మేకర్స్ ప్రమోషన్స్ ను చాలా భారీగానే జరుపుతున్నారు. ఈ రోజు తిరుపతిలో ఈ మూవీ ప్రమోషన్స్ జరగుతున్నాయి.
![]() |
![]() |