ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వర్షంలో పాదయాత్ర చేసిన హీరో నాగశౌర్య

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 14, 2022, 11:20 PM

నాగశౌర్య హీరోగా నటించిన సినిమా 'కృష్ణ వ్రింద విహారి'. ఈ సినిమాకి అనీష్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయినిగా షిర్లే సెటియా నటించింది. ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతం అందించారు.ఈ సినిమా ఈ నెల 23న రిలీజ్ కానుంది. నాగశౌర్య తన సినిమాని కొత్తగా ప్రొమోషన్ చేస్తున్నాడు. ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా  నాగశౌర్య పాదయాత్ర ప్రారంభించారు. ఈ సినిమా బృందం పాదయాత్ర బుధవారం (సెప్టెంబర్ 14) తిరుపతి నగరంలో ప్రారంభమైంది. తిరుపతిలో భారీ వర్షంలో హీరో నాగశౌర్య ‘పాద యాత్ర’ ప్రారంభించారు.సెప్టెంబర్ 15న నెల్లూరు, ఒంగోలు నగరాల్లో నాగశౌర్య పాదయాత్ర చేయనున్నారు.16న విజయవాడ - గుంటూరు,ఏలూరు. 17న భీమవరం,రాజమండ్రి. 18న కాకినాడ, వైజాగ్‌లో ఈ సినిమా బృందం పాదయాత్ర చేయనుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com