ఒలింపిక్స్ లో బంగారు పతాకాన్ని గెలుచుకున్న తొలి భారతదేశపు అథ్లెట్ అభినవ్ బింద్రా జీవితం ఆధారంగా ఒక సినిమా రూపొందబోతుంది. నిజానికి 2017లోనే ఈ సినిమాకు శ్రీకారం చుట్టగా, ఎందుకో తెలియదు అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ సినిమాపై ఎలాంటి అప్డేట్ లేదు.
బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, ఆయన కుమారుడు హర్షవర్ధన్ కపూర్ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. లేటెస్ట్ గా ఈ మూవీపై హర్షవర్ధన్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. అభినవ్ బింద్రా బయోపిక్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముగింపు దశకు చేరుకున్నాయని, వచ్చే ఏడాది నుండి షూటింగ్ మొదలవుతుందని తెలిపారు.