నాచురల్ స్టార్ నాని తన కెరీర్లో తొలిసారి నటిస్తున్న పాన్ ఇండియా మూవీ "దసరా". శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. నాని, కీర్తి కాంబోలో రాబోతున్న రెండో సినిమా ఇది.
శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. మేకర్స్ ఈ మూవీ మేకింగ్ పై 70 కోట్లు ఇన్వెస్ట్ చెయ్యగా, ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే పెట్టుబడి చేతికొచ్చేసి, పది కోట్ల లాభంలో ఉన్నారని టాక్. నాని గత సినిమాలకు లేని విధంగా ఈ సినిమా థియేట్రికల్ హక్కులు ఇంతటి భారీ ధరకు అమ్ముడుపోవడం తో నాని అభిమానులు కూడా షాకింగ్ లో ఉన్నారట. మరి చూడాలి, ఇంతటి భారీ బడ్జెట్ మూవీ నానికి ఎలాంటి సక్సెస్ ను తీసుకొస్తుందో.