తమిళంలో తిరుచిత్రంబలం, తెలుగులో తిరు టైటిల్స్ తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ కొట్టారు కోలీవుడ్ హీరో ధనుష్. ఈ సినిమాలో ధనుష్ సరసన ముగ్గురు హీరోయిన్లు నిత్యామీనన్, రాశిఖన్నా, ప్రియభావాని శంకర్ నటించారు.
లేటెస్ట్ గా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ప్రముఖ ఓటిటి సన్ నెక్స్ట్ లో ఈ నెల 23 నుండి ఈ మూవీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది.
మిత్రన్ ఆర్. జవహర్ ఈ సినిమాకు దర్శకుడు కాగా, అనిరుద్ సంగీతం అందించారు. ప్రకాష్ రాజ్, భారతీరాజా కీలకపాత్రల్లో నటించారు.